CONTACT US
-
Near New Flyover,
Yagarlapalli,
Eluru Road,
Taepalligudem - 534102,
West Godavari Didtrict, A.P - Email: sales@vsnpootharekulu.com
- +91 98482 44429
- +91 98482 44249
రేకులు తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడతారు. కుండ నున్నగా గుండ్రంగా ఉండేలా చూసుకుంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రము చేస్తారు. దోశకి వాడే విధంగా వరిపిండి మిశ్రమాన్ని పలుచగా జాలుగా వచ్చేలా చేసుకుని ఒక రోజులో నాలుగు గంటలు బియ్యం నానబెడతారు. నానబెట్టిన బియ్యం గ్రైండర్ లో వేసి దోసెపిండి వలె రుబ్బుకోవాలి. తరువాత కుండకు ఉన్న రంధ్రము ద్వారా కొబ్బరి ఆకులతో మంట పెట్టి కుండను వేడెక్కిస్తారు. తరువాత జాలుగా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పలుచని గుడ్డను ముంచి దానిని వెడల్పుగా కుండపై ఒక వైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది. దానిని రేకుగా పిలుస్తారు.
తయారు చేసుకున్న రేకులో తీపిపదార్ధాలను వేసి పొరలు పొరలుగా మడిచి పెట్టి పూతరేకులను తయారు చేస్తారు. ఈ తీపి పదార్ధాలు రకరకాలుగా ఉంటాయి.
నెయ్యి బెల్లం వేసి తయారు చెయ్యడం సంప్రదాయకంగా వస్తున్న పద్ధతి.
అలాగే పంచదార పొడి వేసి కూడా తయారు చేస్తారు.
జీడిపప్పు మరియు బాదం పప్పు వేసి తయారు చెయ్యడం ఒక పద్ధతి.